
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన బంగారు నిల్వలను పెంచుతూనే ఉంది. సెప్టెంబర్ చివరి నాటికి ఆర్బీఐ మొత్తం బంగారు నిల్వలు 880 టన్నులను దాటాయి. ఆర్బీఐ విడుదల చేసిన డేటా ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ బంగారు నిల్వలు 880 టన్నుల మార్కును అధిగమించాయి. దేశ చరిత్రలోనే తొలిసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వద్ద ఉన్న బంగారం నిల్వల విలువ 100 బిలియన్ డాలర్ల మార్కును దాటింది.