
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ స్టార్ లింక్‌కు భారత్‌లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం విభాగం లైసెన్స్‌ను జారీచేసింది. భారత్‌లో ఈ రకమైన లైసెన్స్ పొందిన మూడవ కంపెనీగా స్టార్‌లింక్ నిలిచింది. స్టార్ లింక్ సంస్థ తక్కువ ఎత్తులో ఉండే కక్ష్యలో ఉండే ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. ప్రస్తుతం స్టార్‌లింక్‌కు చెందిన 6వేల శాటిలైట్లు భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్నాయి.