
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. దక్షిణ అమెరికా దేశం కొలంబియాలోని ఈఐఏ యూనివర్సిటీలో మాట్లాడిన ఆయన ‘ప్రస్తుతం భారత ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడే దేశానికి అతి పెద్ద ముప్పు.
భారత్ అంటే వివిధ సంస్కృతులు, మతాలు, భావాల సమాగమం. వీటి మధ్య చర్చకు చోటు ఉండాలి. ఇది ప్రజాస్వామ్యం ద్వారానే సాధ్యమవుతుంది. కానీ ప్రస్తుతం ప్రజాస్వామ్యంపై హోల్‌సేల్‌గా దాడి జరుగుతోంది. అది పెద్ద ముప్పు’ అని అన్నారు.