
అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ చైనా కేంద్రంగా జరుగుతున్న ఐఫోన్ల ఉత్పత్తిని క్రమంగా భారత్‌కు విస్తరిస్తోంది. ప్రస్తుతం 22 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్ల ఉత్పత్తికి భారత్ వేదికైంది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, ప్రపంచంలోని ఐఫోన్లల్లో 20 శాతం భారత్‌లోనే తయారవుతున్నాయి.ప్రస్తుతం దక్షిణాదిలోని ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో అధిక శాతం ఐఫోన్లను అసెంబుల్ చేస్తున్నారు. టాటా గ్రూప్‌కు చెందిన ఎలక్ట్రానిక్ విభాగం కూడా ఐఫోన్ అసెంబ్లీలో కీలకంగా ఉంటోంది.