భారత్‌పై విధించిన సుంకాలను ఏదో ఒక సమయంలో తగ్గించాలని అమెరికా యోచిస్తోందని, భారత్‌తో తాము న్యాయమైన ఒప్పందం కుదుర్చుకునేందుకు దగ్గరగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. గతంలో చేసుకున్న ఒప్పందానికి భిన్నంగా ఇప్పుడు ఒప్పందం ఉంటుందని పేర్కొన్నారు. భారత్‌కు అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ వైట్‌హౌస్‌లో ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ట్రంప్ భారత్‌పై సుంకాల గురించి ప్రస్తావించారు
భారత్‌కు సన్నిహితంగా చర్చలు జరిగేలా చూడాలని సెర్గియోకు ట్రంప్ సూచించారు.

