
పాకిస్తాన్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా గ్రూపులు భారత్‌పై విషం చిమ్ముతున్నాయి. దుష్ప్రచారానికి తెర తీశాయి. పాత వీడియోలను తాజాగా పోస్ట్ చేస్తోన్నాయి. భారత్‌లోని ఆర్మీ పోస్టులను నిర్వీర్యం చేసినట్లు చెప్పుకొంటోన్నాయి. ఆర్మీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాలపై విధ్వంసక దాడిని చేసినట్లు ప్రగల్భాలు పలుకుతున్నాయి. ఆ వీడియోలు ఇప్పటివి కావు. 2021 జులై 7వ తేదీన హజీరా పోర్ట్‌లో ఓ ట్యాంకర్ పేలుడుకు సంబంధించిన వీడియోలు అవి. వాటిని ఇప్పుడు సర్కులేట్ చేస్తోన్నారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. దీన్ని నమ్మవద్దని కోరింది.