
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలపై కీలక ప్రకటన చేశారు. లిబరేషన్ డే సందర్భంగా 60కి పైగా దేశాలపై ఆయన ప్రతీకార సుంకాలను ప్రకటించారు. అలాగే అధికారిక ఉత్తర్వులపై కూడా ట్రంప్ సంతకాలు చేశారు.
ఇతర దేశాలపై విధించిన టారిఫ్‌లు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు..ట్రంప్. ఈ రోజును ‘లిబరేషన్ డే’గా అభివర్ణించిన ట్రంప్..అమెరికా ఇండస్ట్రీ ఈరోజు పునర్జన్మించిందని చెప్పారు. అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారని మండిపడ్డ ట్రంప్.. ఇక అలా జరగదని స్పష్టం చేశారు.