భారత్‌లో పర్యటిస్తున్న ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ, అతడి బృందం అభిమానుల ప్రేమకు పులకించిపోతున్నారు. మూడో రోజు ఢిల్లీలో అపూర్వ స్వాగతం అనంతరం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫ్యాన్స్‌ను అలరించాడు మెస్సీ. టీ20 ప్రపంచకప్ టికెట్ విడుదల చేసిన తర్వాత..భారీగా తరలివచ్చిన అభిమానలను ఉద్దేశించి ఫుట్‌బాల్ ఐకాన్ మాట్లాడాడు. తాము మరోసారి భారత్‌కు వస్తామని, అప్పుడు ఖచ్చితంగా మ్యాచ్ ఆడుతామని మాటిచ్చాడీ సాకర్ లెజెండ్. మరోసారి చెబుతున్ను.. మేము తప్పనిసరిగా భారత్‌కు మళ్లీ వస్తాం. అందరికీ కృతజ్ఞతలు’ అని మెస్సీ ఒకింత ఉద్వేగంగా మాట్లాడాడు.

