దేశంలో గత కొద్ది రోజులుగా ఇంధన మరియు గ్యాస్ కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒక శుభవార్త అందింది. భారత్కు చెందిన రెండు భారీ ఎల్పీజీ (LPG) నౌకలు ‘జగ్ వసంత్’ మరియు ‘పైన్ గ్యాస్’ సోమవారం ఉదయం అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ఈ నౌకలు అక్కడ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.. ఇవి దేశీయ నౌకాశ్రయాలకు చేరుకుంటే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వంట గ్యాస్ కొరత తీరుతుందని అధికారులు భావిస్తున్నారు.

