భారతీయ చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడు, కమెడియన్ గోవింద్ అస్రాని (84) తుదిశ్వాస విడిచారు. షోలే చిత్రంలో జైలర్ పాత్రతో గుర్తింపు పొందిన నటుడు సోమవారం కన్నుమూశారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయన మధ్యాహ్నం 3 గంటలకు కన్నుమూశారు. 1964లో అస్రానీ పుణేలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి శిక్షణ పొందారు. అస్రానీ ‘హరే కాంచ్ కి చురియాన్’ చిత్రంలో తన తొలి అవకాశాన్ని పొందాడు.1971 సంవత్సరం తర్వాత.. అస్రానీ సినిమాల్లో కమెడియన్గా.. నటుడి స్నేహితుడి పాత్రల్లో కనిపిస్తూ వచ్చారు.

