
కీవ్‌లోని ఒక భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ గొడౌన్‌పై రష్యా క్షిపణితో దాడి చేసినట్టు ఉక్రెయిన్ పేర్కొంది. తమ దేశంలోని భారతీయ వ్యాపారాలను రష్యా “ఉద్దేశపూర్వకంగా” లక్ష్యంగా చేసుకుందని న్యూఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ఆరోపించింది. దీనికి ముందు ఆ దేశంలో బ్రిటన్ రాయబారి సైతం ఎక్స్‌లో వెల్లడించారు. ఆయన ఇందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. కానీ, ఇది క్షిపణి దాడి కాదని, డ్రోన్లు అని ఆయన తెలిపారు. భారతీయ వ్యాపారవేత్త రాజీవ్ గుప్తాకు చెందిన కుసుమ్.. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ఫార్మా సంస్థలలో ఒకటి.