
భారతీయుల కోసం ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ భారతదేశంలోని తన వినియోగదారులకు సబ్‌స్క్రిప్షన్ ఫీజులను గణనీయంగా తగ్గించిందని నివేదికలు సూచిస్తున్నాయి.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 48 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. మొబైల్ యాప్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ రూ.900 నుండి రూ.470కి వెబ్ ఖాతాలకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ రూ.650 నుండి రూ.427కి తగ్గించింది