loader

ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని భారతి సిమెంట్స్ కార్యాలయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. ఈ కేసులో నిందితులు రాజ్ కసిరెడ్డి, బాలాజి, గోవిందప్ప, చాణక్యలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బాలాజి, గోవిందప్ప డైరెక్టర్లుగా పనిచేసిన భారతి సిమెంట్స్ కార్యాలయం, చాణక్యకు చెందిన గ్రిల్ రెస్టారెంట్ లో సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని భారతి సిమెంట్స్ కార్యాలయం కేంద్రంగా ఏపి మద్యం కుంభకోణం నడిచినట్లు సిట్ అనుమానించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON