అమరావతి భవిష్యత్తులో హైదరాబాద్ ప్లస్ నగరంగా అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. టెక్నాలజీని అనుసంధానించి అమరావతిని స్మార్ట్, బ్లూ, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో జరిగిన ‘సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్-2026, ట్రాన్స్ఫార్మింగ్ ఏఐ’ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. సదస్సులో ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీతింగ్’ అనే అంశంపై సీఎం తన అభిప్రాయాలను వెల్లడించారు.

