భద్రాద్రి రామయ్యను దర్శించుకోవడానికి ఐదుగురు యువకులు భద్రాచలం వచ్చారు. అనంతరం పట్టణ శివారులోని వేలేరు ప్రాంతంలో ఉన్న గోదావరి నదిలో స్నానాలు చేయడానికి దిగారు. నది ప్రవాహం లోతుగా ఉండటంతో ఒక్కసారిగా ఐదుగురు యువకులు నీటిలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారి వివరాలు సతీశ్, నవదీప్, తేజజ్ఞ, అభిరామ్, శ్రీకర్ గా గుర్తించారు. వీరితో పాటు ఉన్న మిగతా ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడి సమాచారాన్ని అందించారు. స్థానిక గజ ఈతగాళ్లు నదిలో యువకుల కోసం గాలిస్తున్నారు

