విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గంలోని రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గాన్ని బుధవారం రోజున పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. సీతారాముని పేట కూడలి నుంచి నీలాచలం కొండ వరకు3.70 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామని..కోటప్పకొండ గిరిప్రదక్షిణ మార్గంలో రోడ్డు మంజూరు చేశామని.. త్వరలోనే దానిని కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆలయాల అభివృద్ధి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

