రుసుమండ బ్లోఔట్లో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు ఓఎన్జీసీ సిబ్బందితోపాటు జిల్లా అధికారులు నిరంతరాయంగా పని చేస్తున్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఇరుసుమండ బ్లోఔట్కు క్యాపింగ్ చేయటానికి మరో వారం రోజుల సమయం పడుతుందన్నారు. అయితే ఈ మంటల కారణంగా ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణం నష్టం కానీ జరగలేదని చెప్పారు. సుమారు 80 నుంచి 100 కొబ్బరి చెట్లు 2 ఎకరాల పంట భూమికి నష్టం జరిగిందని తెలిపారు.

