
భారతదేశంలోని ప్రముఖ ఔషధ కంపెనీలలో ఒకటైన హెటిరో హెల్త్‌కేర్ లిమిటెడ్ బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స కోసం సరికొత్త ఔషధాన్ని తీసుకొచ్చింది. హెచ్ఈఆర్2-పాజిటివ్ రకం బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే పెర్టుజుమాబ్ అనే ఔషధానికి బయోసిమిలర్ అయిన పెర్జియా (Perzea) ను అందుబాటులోకి తెచ్చింది. పెర్జియా 420 ఎంజీ ఇంజెక్షన్ ధర రూ.30 వేలుగా నిర్ణయించింది. పెర్టుజుమాబ్‌ను క్యాన్సర్ చికిత్సలో ట్రాస్టుజుమాబ్తో కలిపి వినియోగిస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ కీమోథెరపీల్లో ఈ కాంబినేషన్ కీలకంగా మారింది.