పర్యాటకులతో పాటు ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లే విద్యార్థులపైనా ఇకపై మరింత ఆర్థిక భారం పడనుంది. స్టూడెంట్, విజిటర్ సహా అన్ని కేటగిరీల వీసా ఫీజులను పెంచుతున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. వీసా, సెటిల్మెంట్, స్పాన్సర్ లైసెన్స్ ఫీజుల కొత్త ఛార్జీలు ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి. విద్యార్థి వీసా రుసుములు 524 పౌండ్ల నుంచి 558 (రూ.69,814) పౌండ్లకు పెరగనున్నాయి. మూడేళ్ల స్కిల్డ్ వర్కర్ (కార్మిక) వీసా 769 పౌండ్ల నుంచి 819 (రూ.1,02,470) పౌండ్లకు పెరగనుంది

