ఆంధ్రదేశ చరిత్రలో శౌర్యానికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన బొబ్బిలి యుద్ధం జరిగి నేటికి సరిగ్గా 269 ఏళ్లు పూర్తయ్యాయి. 1757 జనవరి 24న సంభవించిన ఈ చారిత్రాత్మక ఘట్టం, కేవలం ఒక యుద్ధం మాత్రమే కాదు, అది బొబ్బిలి వీరుల పౌరుషానికి, దేశభక్తికి చిహ్నం. బొబ్బిలి కోట పరిసరాల్లో ‘బొబ్బిలి పులి’ తాండ్ర పాపారాయుడి విగ్రహానికి బేబీ నాయనా పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజవంశీయులు, ప్రజలు సమూహంగా యుద్ధ స్తూపం వద్ద అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

