
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ అంటే వెంటనే గుర్తొచ్చేది చైనానే. ప్రపంచ దిగ్గజ కంపెనీల మాన్యఫాక్చరింగ్ కంపెనీల్లో అత్యధికం అక్కడే ఉన్నాయి. ఆ దిగ్గజ కంపెనీలు చైనాకు బదులుగా భారత దేశం బాట పడుతున్నాయి. మన దగ్గరే ల్యాప్‌టాప్ తయారీ యూనిట్లు తెరుస్తున్నాయి. ట్రంప్ సుంకాల కారణంగా చైనాలో తయారైన వస్తువులపై అత్యధిక పన్నుల భారం పడనుంది. దీన్ని ముందే గ్రహించిన కంపెనీలు నష్టాలను తగ్గించుకోవడానికి భారతదేశంలో ఫ్యాక్టరీలను తెరవడం ప్రారంభిస్తున్నాయి. భారతదేశాన్ని ‘సురక్షితమైన స్థావరం’గా భావిస్తున్నాయి.