ప్రముఖ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. బెర్క్‌షైర్ హాత్‌వే సీఈఓ పదవి నుండి దిగిపోనున్నట్లు ప్రకటించారు. తన తర్వాత గ్రెగ్ అబెల్‌కు సీఈఓ బాధ్యతలు అప్పగించారు. వారెన్ బఫెట్ 1965లో బెర్క్ షైర్ హాత్‌వే బాధ్యతలు చేపట్టారు. క్రమశిక్షణ,దీర్ఘకాలిక వ్యూహాలతో ఎన్నో ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ ఇచ్చారు. వీటిని అనుసరించిన ఎంతో మంది లాభాలు పొందారు. దీంతో స్టాక్ మార్కెట్ ప్రపంచంలో ఒక గొప్ప ఇన్వెస్టర్‌గా పేరు గడించాడు. పెట్టుబడులతో ప్రపంచంలోనే కుబేరుడిగా నిలిచాడు.

