
ఉద్యోగ కుంభకోణం వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) బెంగాల్ రాష్ట్ర మంత్రి సుజిత్ బోస్ నివాసంపై శుక్రవారం భారీ స్థాయిలో దాడులు జరిపింది. మున్సిపాల్టీ మాజీ అధికారుల నివాసాలపై ఇడి సోదాలతో కలకలం చెలరేగింది.
మున్సిపాల్టీలలో భారీ స్థాయి జాబ్ స్కామ్ జరగడంతో ఇడి రంగంలోకి దిగింది.మంత్రి ఇంటి నుంచి ఇప్పటికైతే పలు ఒఎంఆర్ షీట్లను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. మంత్రికి చెందిన ఓ రెస్టారెంట్ మేనేజర్‌ను కూడా ఇడి అధికారులు ప్రశ్నించారు. ఈ స్కామ్ కేసు 2024 జనవరికి సంబంధించింది.