పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన విస్తృత సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుంచి దాదాపు 90 లక్షల పేర్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 28న ప్రచురించిన తుది జాబితా నుంచి సుమారు 63 లక్షల పేర్లను తీసివేయగా.. విచారణ అనంతరం అదనంగా 27 లక్షల పేర్లను తొలగించారు. ప్రస్తుతం అప్పీలేట్ ట్రిబ్యునల్ ముందు పెండింగ్లో ఉన్న కేసులను ఈ ఎన్నికల జాబితాలో చేర్చబోమని, వాటిని తదుపరి ఎన్నికలలో చేర్చేందుకు పరిశీలిస్తామని అధికారులు తెలిపారు.

