రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా టీమ్‌తో మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ.. బుమ్రా బౌలింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. బుమ్రా బౌలింగ్‌లో కొంత కంగారుపడినా.. తనకు అలవాటైన రీతిలో చెలరేగానని చెప్పాడు. ‘జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ అంత ఇబ్బందిగా ఏం అనిపించలేదు. నేను బుమ్రా కంటే ఎక్కువగా బంతిని చూసి ఆడాను. ఆరంభంలో బుమ్రాను చూడగానే కాస్త కంగారుపడ్డాను. కానీ నా సహజసిద్దమైన ఆటపై నమ్మకం ఉంచి.. బౌలర్ కంటే బంతిని మాత్రమే చూసి బాదేందుకు ప్రయత్నించాను.

