బుధ్ధుని పవిత్ర అవశేషాలు కేవలం కళాఖండాలు మాత్రమే కాదని, భారత దేశ మహత్తర వారసత్వంలో భాగాలని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. పిప్రహ్వా వద్ద బుధ్ధునికి సంబంధించిన పవిత్ర అవశేషాలైన ఎముక తునకలు, విలువైన రత్నాల ప్రదర్శనను శనివారం ఆయన ప్రారంభించారు. దక్షిణ ఢిల్లీలో కిలారై పితోరా కల్చరల్ కాంప్లెక్స్‌వద్ద ఈ ప్రదర్శన ఏర్పాటైంది. బౌద్ధ సంప్రదాయంపై పరిశోధన మరింత బలోపేతం అవుతుందన్నారు. భావితరాలకు బౌద్ధ సంప్రదాయం సహజమైన రీతిలో చేరేలా తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని హామీ ఇచ్చారు.

