
బీహార్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో పార్టీల్లో ఉత్సాహం పెరిగింది. బీజేపీ (BJP) సైతం గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను కమలం పార్టీ ఇవాళ రిలీజ్ చేసింది 71 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలు కూడా ఉన్నారు.