
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హాకు రెండు ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయని ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు బీహార్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి. ఎన్నికల ప్రక్రియలో ఇలాంటి అవకతవకలు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని తేజస్వి యాదవ్ విమర్శించారు. దీనికి విజయ్ కుమార్ సిన్హా స్పందిస్తూ.. తాను లఖీసరాయ్‌కు మారిన తర్వాత బాంకీపూర్ జాబితా నుంచి పేరు తొలగించాలని దరఖాస్తు చేసుకున్నానని.. ఇది తనపై కుట్ర అని కొట్టిపారేశారు.