బీహార్ లో అధికార, ప్రతిపక్ష కూటమి నేతలపై ప్రశాంత్ కిషోర్ విరుచుకుపడ్డారు బీహార్‌లో ఉన్న అన్ని సమస్యలకు కేంద్ర మంత్రులుగా, సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ చీఫ్ నితీశ్ కుమారే మూలమని ఆయన మండిపడ్డారు. జన్ సురాజ్ పార్టీని గెలిపిస్తే ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల్లో జీవనం గడుపుతున్న బీహారీలు మళ్లీ అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదని, ఓటర్లు మళ్లీ లాలూ, నితీశ్‌కు ఓటు వేస్తే జంతువుల్లా రైళ్లలో మళ్లీ వలసపోవాల్సిందేనని వ్యాఖ్యానించారు

