సంగారెడ్డి జిల్లా బీరంగూడ ఇసుకబావి ప్రాంతంలో దారుణమైన పరువు హత్య జరిగింది. 10వ తరగతి నుంచి ప్రేమించుకుంటున్న శ్రావణ్ సాయి (20), యువతి (19)ల మధ్య సంబంధం తెలిసి యువతి తల్లిదండ్రుల్లో ఆగ్రహం పెరిగింది. ఇంజినీరింగ్ చదువుతున్న శ్రావణ్ సాయిని పెళ్లి విషయంలో మాట్లాడుకుందామని శ్రీజ తల్లిదండ్రులు ఇంటికి పిలిచారు. ఇంటికి వచ్చిన యువకుడిని వారు బ్యాట్లతో, కత్తెరలతో దారుణంగా కొట్టి చంపారు. తీవ్ర గాయాలతో సాయి పడిపోవడంతో, యువతి బంధువులు అతన్ని ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి పారిపోయారు.

