నేతాజీ సుభాశ్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా కోల్కతాలో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారామె. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు దేశ చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకుంటూ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. నేతాజీ సుభాశ్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, బీఆర్ ఆంబేడ్కర్ వంటి జాతీయ ప్రముఖులను బీజేపీ, కేంద్ర ప్రభుత్వం అవమానించాయని ఆమె వ్యాఖ్యానించారు.

