
బీఎస్‌ఎన్‌ఎల్ 5జి సేవలను మొదట దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభించి, తరువాత దేశంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించవచ్చని ఎకనామిక్ టైమ్స్ నివేదిక పేర్కొంది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. బీఎస్‌ఎన్‌ఎల్ ఆర్థిక పునరుద్ధరణ మార్గంలో ఉందని, 2025 మధ్యకాలం నుండి 5జి లాంచ్ వైపు టెలికాం సంస్థ అడుగులు వేస్తుందని అన్నారు. BSNL ఇప్పుడు 5G ప్రీమియం బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్‌ను కలిగి ఉంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన 5G నెట్‌వర్క్ సేవలను ఎంపిక చేసిన నగరాల్లో ప్రారంభించాలని యోచిస్తోంది.