కాంగ్రెస్ నేతలు నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ 15వ వార్డు అభ్యర్థి నసీమా బేగం నామినేషన్ను విత్ డ్రా చేయించే ప్రయత్నం చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, కాంగ్రెస్ నేతలు నసీమా బేగం ఇంటికి వెళ్లి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ ప్రలోభాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి నసిమా బేగం ఇంట్లో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. అభ్యర్థి నసిమా బేగం చివరకు మర్రి జనార్దన్ రెడ్డి నాయకత్వంలోనే తాను పనిచేస్తానని తెగేసి చెప్పడంతో కాంగ్రెస్ నేతలు వెళ్లిపోయారు.

