బిహార్ శాసనసభ ఎన్నికల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన 25 ఏళ్ల మైథిలీ ఠాకూర్ విజయం సాధించారు. బిహార్‌లోని మిథిలాంచల్ ప్రాంతంలో కీలకమైన అలీనగర్ శాసనసభ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున తొలిసారి బరిలోకి దిగారు మైథిలీ. ఆమెకు మెుత్తం 84,915 ఓట్లు రాగా.. 11,730 ఓట్ల మెజారిటీ సాధించారు. దీంతో బిహార్ అసెంబ్లీకి ఎన్నికైన అతి చిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పారు. మైథిలీ ఠాకూర్.. గతంలో బిహార్ ఎన్నికల కమిషన్ తరఫున ‘స్టేట్ ఐకానిక్(State Iconic)’గా నియమితులయ్యారు.

