తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గొప్ప చెప్పారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి కెటిఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రూ.160 కోట్లు ఖర్చు చేశారని, పంచాయతీ ఎన్నికల్లో బిసిలకు కేవలం 17 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని దుయ్యబట్టారు. బిసిలకు గతంలో 24 శాతం ఉండేదని, ఇప్పుడు 17 శాతానికి తగ్గించారని మండిపడ్డారు. రిజర్వేషన్ల తగ్గింపు ప్రజాధనం దుర్వినియోగంపై రాహుల్ స్పందిస్తారా? అని ప్రశ్నించారు.

