బాలీవుడ్ సినిమా ధురంధర్ విడుదలై నెల దాటుతున్న ఇంకా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.1300 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం తాజాగా మరో రికార్డును అందుకుంది. గత 9 ఏండ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ‘బాహుబలి 2’ రికార్డును ధురంధర్ తాజాగా అధిగమించింది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా 20.7 మిలియన్ డాలర్లతో ‘బాహుబలి 2’ అగ్రస్థానంలో ఉండగా..
ఇప్పుడు ‘ధురంధర్’ 21 మిలియన్ డాలర్ల మార్కును దాటి అగ్రపీఠాన్ని కైవసం చేసుకుంది.

