తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రాన్ని సందర్శించారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయన, జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో తన మనవడికి అక్షరాభ్యాసం చేయించారు. యాదాద్రి తరహాలో బాసరను కూడా ఆధ్యాత్మికంగా, పర్యాటక పరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. భక్తులకు అవసరమైన వసతులు, ఆలయ ప్రాంగణ విస్తరణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

