చెన్నూర్ నియోజకవర్గంలోని క్యాతన్ పల్లిలో జరిగిన ఘటనలో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజులు అనగా.. మార్చి 3 వరకు ఆయనకు రిమాండ్ విధిస్తున్నట్టు గురువారం మంచిర్యాల కోర్టు వెల్లడించింది. పోలీసులు బాల్క సుమన్‌ను ఆదిలాబాద్ జైలుకు తలరించనున్నారు. మంగళవారం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దాంతో, బుధవారం పోలీసులు మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసకున్నారు.

