ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌ను ఇవాళ(శుక్రవారం) కలిశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ విషయాన్ని లోకేశ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. సంజయ్ దత్‌ను కలవడం ఆనందంగా ఉందని, ఏపీలో సినిమా రంగ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. సినిమా షూటింగ్‌లకు అనుమతులు సులభంగా లభించేలా సింగిల్ విండో వ్యవస్థను అమలు చేసే అంశంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది.

