బాలీవుడ్ ప్రముఖ నటుడు సతీష్ రవీలాల్ షా కన్నుమూశారు. ఆయన వయస్సు 74 పంవత్సరాలు. హాస్యంతో పాటు సామాజిక అంశాలపై తీసిన పలు సినిమాలలో ఆయన నటనలో జీవించారు. షా భారతీయ సినిమా టీవీ రంగాలలో పేరు తెచ్చుకున్నారు. ఆయన నటనావృత్తిలో దశాబ్దాల అనుభవం గడించారు. మాలామాల్, హీరాపేరి, కల్ నా హో నా హో వంటి హిట్ సినిమాలలో నటించారు. ఫిల్మ్ ఇనిస్టూట్ (ఎఫ్టిఐఐ) గ్రాడ్యుయెట్ అయిన సతీష్ షాకు రంగస్థలంపై కూడా పట్టుంది.

