
నటి పూనమ్ కౌర్ చేసిన బాలయ్యపై కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ బాలకృష్ణని పొగిడిందని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తాజాగా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ మరోసారి చర్చకు దారితీసింది. ‘బాలయ్య ఎప్పుడూ చిన్నపిల్లాడిలా ఉత్సాహంగా ఉంటారని నేను ఎప్పుడు చెబుతుంటాను. దేవుడు కొందరు వ్యక్తుల్ని ఓ లక్ష్యం కోసం సాధనంలా సృష్టిస్తాడు. అది సమయానుసారం బయటపడుతుంది’ అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది