
నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవలే తాను ఇండస్ట్రీలో నటుడిగా 50ఏళ్ల కెరీర్ ని పూర్తి చేసుకున్నారు.లకృష్ణకి మరో అరుదైన గౌరవం దక్కించింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే గోల్డ్ ఎడిషన్లో బాలయ్యకి స్థానం దక్కింది. లండన్లో ప్రధాన కార్యాలయం ఉన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (WBR).. యూకే, యుఎస్ఎ, కెనడా, స్విట్జర్లాండ్, ఇండియా, యుఎఇలలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ. వారి అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాలలో ఒకదాన్ని నట సింహం నందమూరి బాలకృష్ణకి ప్రదానం చేస్తున్నారు.