ప్రమాదంపై డీఐజీ కోయ ప్రవీణ్ స్పందించారు. ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బస్సులో 38 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే 11 మృతదేహాలను వెలికితీశామన్నారు. బైక్‌ను ఢీకొని మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించిందని స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ డోర్స్ పగలగొట్టి కొందరు బయటపడ్డా.. మరికొంత మంది రాలేకపోయారన్నారు. మంటలతో బస్సులో ఉన్నవారికి తీవ్రగాయాలయ్యాయని ఎస్పీ విక్రాంత్ పేర్కొన్నారు

