
బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఏపీ సర్కార్కు షాక్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టు పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ప్రాథమిక రిపోర్టును పరిశీలించిన కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ పలు అంశాలపై అభ్యంతరాలును వ్యక్తం చేసింది. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని .. ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని తెలిపింది. పర్యావరణ అనుమతులకు సెంట్రల్ వాటర్ కమిషన్ను సంప్రదించడం అత్యవసరమని ఏపీకి సమాచారం ఇచ్చింది.