తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ పేరిట పోటీలు నిర్వహించనుంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమం తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై షార్ట్ ఫిలిమ్స్, పాటల పోటీలు ఉంటాయి. షార్ట్ ఫిలిమ్స్ నిడివి 3 నిమిషాలకు, పాటల వ్యవధి 5 నిమిషాలకు మించి ఉండకూడదు. ఎంట్రీలను youngfilmmakerschallenge@gmail.com, వాట్సాప్ నెంబర్ – 8125834009 (WhatsApp Only)కు పంపాలి. ఎంట్రీలను పంపించేందుకు తుది గడువు సెప్టెంబరు 30, 2025గా నిర్ణయించారు.

