
42 శాతం రిజర్వేషన్లు ముస్లింలను ఎలా బీసీల్లో కలుపుతారు? అంటూ చేసిన వ్యాఖ్యలపై. బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలను ఉద్దేశించి కఠిన వ్యాఖ్యలు చేశారు. ముసలి కన్నీరు కారుస్తూ కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు.
గుజరాత్‌లో వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. అక్కడ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిన కేంద్రం, ఇక్కడ మాత్రం బీసీలను బలహీనపరచే ప్రయత్నం చేస్తోందని మీడియా సమావేశంలో.. ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.