బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా తారిఖ్ రెహమాన్(60) ప్రమాణ స్వీకారం చేశారు. 18 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఇక్కడ తాత్కాలిక ప్రభుత్వ పాలనకు తెరపడినట్లయింది. సాంప్రదాయానికి భిన్నంగా బంగభవన్‌కు బదులు జతియా సంసద్ సౌత్ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెహమాన్ చేత అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ప్రమాణం చేయించారు.రెహమాన్ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా, దివంగత అధ్యక్షుడు జియాఉర్ రెహమాన్‌ల కుమారుడు. ప్రమాణ స్వీకారానికి ముందు రెహమాన్‌ను బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(బిఎన్‌పి) ఎంపిలు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు.

