బంగ్లాలో మైనార్టీలపై హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ దేశంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను కొనడాన్ని తప్పు పడతున్నారు కొందరు. దాంతో ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌ను పంతొమ్మిదో సీజన్ ఆడనిస్తారా? లేదా? అనేది తెలియడం లేదు. బీసీసీఐ మాత్రం ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌లో ఆడించడంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని అంటోంది.

