బంగ్లాదేశ్‌లోని బాగర్‌హాట్ జైలులో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులు ఎట్టకేలకు స్వేచ్ఛను పొందారు. భారత ప్రభుత్వం, బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో మంగళవారం మత్స్యకారుల విడుదల ప్రక్రియ పూర్తయ్యింది. బంగ్లాదేశ్ హోం శాఖ డిప్యూటీ సెక్రటరీ మహమ్మద్ అఫీజ్ ఆల్ అసాద్ స్వయంగా డాకా నుంచి జైలుకు చేరుకుని మత్స్యకారులను విడుదల చేశారు.

