బంగ్లాదేశ్లో కీలక రాజకీయ పరిణామం జరిగింది. విద్యార్థుల ఆందోళనలతో షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత తొలిసారి జరిగే సార్వత్రిక ఎన్నికలకు తేదీలు ఖరారు అయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 2026 ఫిబ్రవరి 12న ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని బంగ్లాదేశ్ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఏఎంఎం నాసిరుద్దీన్ గురువారం ప్రకటించారు.

